అబ్బురపరచిన కరాటే విద్యార్థుల విన్యాసాలు
గోపాలపేట ఏప్రిల్ 3: మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం కరాటే విన్యాసాలు పలువురిని అబ్బురపరిచాయి. విక్టరీ చోటా ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే విన్యాసాల్లో బుద్ధారం గోపాలపేట ఏదుట్ల కస్తూర్బా గాంధీ విద్యార్థులు సుమారుగా 100 మంది విద్యార్థులు విన్యాసాల్లో పాల్గొన్నారు. విక్టరీ చోటా ఖాన్ కరాటే ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో 20 మంది బుద్ధారం విద్యా ర్థులు పాల్గొనగా 100 మంది గోపాల్పేట వి ద్యార్థులు పాల్గొన్నారు
కస్తూర్బా విద్యార్థులు కర్ర సాము, నాంచాకు ,స్టమక్ పై నుంచి బైకు ,చేతులపై నుంచి కారుని ,జి మ్నాస్టిక్స్ అలాగే వాసుదేవ్ ఇనుప చూవ్వల మీద పడుకొని స్టమక్ పైన రాయి పెట్టి పెద్ద గన్నుతో ఆ బండరాయిని పగలగొట్టడం వి ద్యార్థులు కర్ర సాము కరాటే విన్యాసాలు అద్భుతంగా కరాటే విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు విద్యార్థులను అభినందించారు
ఈ ప్రోగ్రాం లో వనపర్తి ఎస్త్స్ర నరేష్ గ్రామ స ర్పంచ్ స్వప్న భాస్కర్ , కస్తూరిబాయి స్కూ ల్ ఎస్ ఓ దీప్తి, సుస్మిత కరాటే మాస్టర్లు జ యరాం నిఖిల్ యాదవ్ దయ్యం రాజు, శివ ,చంద్రశేఖర్, జస్వంత్ , జయరాం పవన్ యాదవ్ ,వాసుదేవ్ , కాశివిద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.




