calender_icon.png 27 July, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెజోనెన్స్ స్కూల్‌లో కార్గిల్ విజయ్ దివస్

27-07-2025 12:21:24 AM

రెడ్డీష్, ఆరంజ్ డే వేడుకలు

ఖమ్మం, జూలై 26 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీ రెజినెన్స్ స్కూల్‌లో శనివారం కార్గిల్ విజయ్ దివస్, రెడ్డీష్ ఆరెంజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.డైరెక్టర్ కొండ శ్రీధర్‌రావు మాట్లా డుతూ.. కార్గిల్‌లో పోరాడిన వారి సేవలు మనం ఎప్పుడూ మరిచిపోకూడదని, ఆపరేషన్ విజయ్ పేరుతో రెండు నెలలపాటు యుద్ధం చేసి భూ భారతాన్ని తిరిగి పొందినందుకుగాను జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆరంజ్ కలర్ త్యాగానికి నిదర్శనమని, ఘనంగా ఆరెంజ్ డే పిల్లలతో నిర్వహించిన ట్లు తెలిపారు. స్కూల్ డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ.. రెండు కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంకరం గా ఉన్నదన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పివిఆర్ మురళీమోహన్, బోధన, బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.