17 April, 2026 | 11:01 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పుస్తె మట్టెలు పంపిణీ చేసిన కరీంనగర్ ఆర్యవైశ్య నేతలు

28-10-2025 07:41 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన అమ్మాయి నవ్య వివాహం నవంబర్ 1వ తేదీన నిశ్చయించడం కావడంతో, ఆ నిరుపేద కుటుంబానికి సహాయంగా వివాహం చేయడానికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య నేతలు ముందుకు వచ్చారు. కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ దాతల సహకారంతో కరీంనగర్ లోని వైశ్య భవన్ లో పెళ్లికూతురుకి చీర, పుస్తె మట్టెలు అందజేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇకముందు కూడా చేస్తామని తెలిపారు. మమ్మల్ని ప్రోత్సాహస్తూ సహాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, బొడ్ల శ్రీరాములు, తిరుపతి, అలెంకి సంతోష్ రాజ్, సంతోష్, కిరణ్ కుమార్ తో పాటు అమ్మాయి బంధువులు పాల్గొన్నారు.