28-10-2025 07:39:54 PM
భవన కార్మిక సంఘం రాష్ట్ర మహిళ కన్వీనర్ కోట సంధ్యారాణి
చిట్యాల,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పలు రంగాలలో ఉన్న మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు, మహిళ రక్షణ కల్పించాలని భవన నిర్మాణ కార్మిక మహిళ రాష్ట్ర కన్వీనర్ కోట సంధ్యారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో సిఐటియు 4 వ జిల్లా మహాసభల కరపత్రాలను హమాలీ, భవన కార్మిక మహిళలతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేటి ఆధునిక యుగంలో కూడా 19 నిమిషాలకు ఒక మహిళ పై అత్యాచారానికి గురవుతుందని నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు సర్వేలో తేలడం, మహిళలకు రక్షణ లేని పరిస్థితి నెలకొనడం బాధాకరమని, మహిళలకు పని గంటలు పెంచుతూ, సమాన వేతనాలలో వివక్షత చూపుతూ దోపిడికి గురవుతున్న మహిళలకు అండగా సిఐటియు ఉంటుందని నవంబర్ 08 న రామన్నపేటలో సిఐటియు 4 వ జిల్లా మహాసభలలో పలు రంగాలలో ఉన్న కార్మిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.