calender_icon.png 28 October, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి

28-10-2025 07:42:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ లో ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అన్నారు.. మంగళవారం  భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన బిజెపి కార్యాలయములో ఏర్పాటు చేసిన బిజెపి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి  పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తమ పంట పొలాలు కోయడం జరుగుతుంది కాని ఇంత వరకు ప్రభుత్వం ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేయకపోవడం రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నారని సంజీవ రెడ్డి అన్నారు. అధిక వర్షాలు ఉన్నాయి కావున వెంటనే ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేయాలనీ లేని సమయంలో బిజెపి తరుపున ఆందోళన కార్యక్రమాలను చేయడం జరుగుతోందని అన్నారు