calender_icon.png 31 July, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జలమయం

24-07-2025 12:08:09 AM

- బుధవారం దంచికొట్టిన వాన

- చెరువుల్లా మారిన రోడ్లు, కాలనీలు

 -ఇళ్లల్లోకి వరద నీరు

- కలెక్టర్ కు కేంద్రమంత్రి బండి ఫోన్

- రంగంలోకి దిగిన బల్దియా అధికారులు

కరీంనగర్, జూలై 23 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కు రిసిన భారీ వర్షాలకు రహదారులు జలమయమై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డా యి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గోదావ రి వరద ఉధృతి ఇంకా మొదలు కాకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి ద్వా రా మిడ్ మానేరు, ఎఫ్‌ఎండీలకు వరద కా లువ ద్వారా నీరు ఇంకా విడుదల కాలేదు.

మరో మూడు రోజులు వర్షాలు పడితే ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దపల్లి నియోజకవర్గ పరిధి లోని సబ్బితం, సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతాలు ఉప్పొంగాయి. కరీంనగర్ పట్టణంలోని ప్రధాన రహదారులు, జ్యోతినగర్ తోపాటు పలు లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏ ర్పడింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రా గా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

జగిత్యాల రోడ్డులోని సమీపంలో భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ప డ్డారు. సిరిసిల్ల రహదారిలోని రాంనగర్ స మీపంలో, ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో వ ర్షపు నీరు ఉదృతం ప్రవహించడంతో గంటపాటు వాహనదారులు ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం అల్లునూ రు చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో హైదరాబాద్, వరంగల్ ర హదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద వర్షపునీరు చేరడం తో కొద్దిసేపు ఇబ్బందులు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన శర్మనగర్, ముకరంపు ర ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరుకుంది.

కలెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి ఫోన్

కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నంజయ్ కుమార్ బుధవారం ఫోన్ చేశారు. భారీ వ ర్షాల నేపథ్యంలో పరిస్థితిపై న్యూఢిల్లీ నుండి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా జిల్లా ల కలెక్టర్లు ఎలాంటి నష్టం సంభవించలేదని వెల్లడించారు. ముందస్తుగా అన్ని రకాల జా గ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు.

రంగంలోకి దిగిన బల్దియా అధికారులు

నగరంలో భారీ వర్షానికి ప్రధాన రహదారులతోపాటు రోడ్లు జలమయం కావడం తో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు, సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సంద ర్భంగా విపత్తు నివారణ సిబ్బందిని రంగంలోకి దించారు. జగిత్యాల రోడ్డు, అల్గునూ రుల వద్ద నాలాల ద్వారా నిలిచిపోయిన నీ టిని తొలగించారు. ఈ మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ మున్సిపల్ సిబ్బందిని కమిషనర్ అప్రమత్తం చేశారు.

ఇది ఆర్ అండ్ బీ తప్పిదమే: మాజీ మేయర్ సునీల్ రావు

నగరంలో ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్య వైఖరితోనే చిన్నపాటి వర్షాలకే ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు. నగరపాలక సంస్థ ద్వారా గతంలోనే డ్రైనేజీ వ్యవస్థను విస్తరించినప్పటికీ ప్రధాన ఆర్‌అండ్ బి రహదారు ల్లో వరద కాలువలను ప్రణాళిక ప్రకారం ని ర్మించకపోవడంతో వర్షాలకు వరదనీరు సులువు గా వెళ్లకపోవడంతో రహదారులు, కాలనీలు జలమయమవుతున్నాయి.  వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అం డ్ బి శాఖకు తెలిపినప్పటికీ పెడచెవిన పెట్టా రు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత సమస్యలను గుర్తించి కల్వర్టులకు మరమ్మత్తులు చేసి వర్షంపు నీరు సులువుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.