24-07-2025 12:08:06 AM
పటాన్ చెరు/జిన్నారం, జులూ 23 : జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ ఏర్పాటు చేసిన ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు ప్రేమావతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య సంస్థ యాబై శాతం సబ్సిడీపై కుట్టు మిషన్లు, నెల రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తుండడం హర్షనీయమన్నారు.
గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఉపాధి, ఆర్థికాభివృద్దికి తోడ్పాటునందిస్తున్న నిర్వాహకులను హెచ్‌ఎం అభినందించారు. ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు సంధ్యారాణి, మహిళలు పాల్గొన్నారు.