calender_icon.png 15 September, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్లు పెంచాలి

15-09-2025 06:22:55 PM

-పెన్షన్లను సాధించేవరకు కృష్ణ మాదిగ పోరాడుతాడు

- ఎమ్మార్పీఎస్ నాయకులు పెన్షన్ దారులతో కలిసి తాసిల్దార్ కార్యాలయం ముట్టడి

- ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్

మునుగోడు,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందుకే వృద్ధుల వితంతువుల వికలాంగుల పెన్షన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ మేడి శంకర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు చేయూత పెన్షన్ దారులకు వచ్చే 2000 పెన్షన్ను 4000 పెంచాలని, 4000 వికలాంగుల పెన్షన్ను 6000, వికలాంగులకు నెలకు 15000 రూపాయల పెన్షన్, అర్హులై ఇప్పటివరకు పెన్షన్ రానటువంటి నూతన పెన్షన్ దారులకు వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పందుల ఆంజనేయులు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని పెన్షన్ దారులతో కలిసి ముట్టడి చేసి తాసిల్దార్ నేలపట్ల నరేష్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.

పెన్షన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మరిచిపోయి వృద్ధులను వితంతువులను పెన్షన్ పెంచకుండా అవమానపరిచి వాళ్ళ ఓపికను పరీక్షిస్తున్నాడని వివరించారు. పెన్షన్ దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలుగా పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కొక్కరికి 40,000 రూపాయల నష్టం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రభుత్వం పెన్షన్ పెంచకపోతే ఇంకా మూడు సంవత్సరాల లో పెన్షన్దారులకు 72,000 నష్టం జరుగుతుంది అని తెలియజేశారు.

పెన్షన్దారులు ఏకమై మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన పెన్షన్ రాను బట్టి పెన్షన్ దారులు పెన్షన్ 2000 వస్తున్నటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు డయాలసిస్ పేషెంట్, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ప్రతి ఒక్కరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పట్టించే విధంగా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. నూతన పెన్షన్లను మంజూరు చేయని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వృద్ధులు వితంతువులు కచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి హెచ్చరించారు.