calender_icon.png 22 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ ముసుగులో కార్పొరేట్ హిందూ దేశం

22-10-2025 02:22:51 AM

-మావోయిస్టు నేతల హత్యకు నిరసనగా 24న భారత్ బంద్

-మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్

హుస్నాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి) :కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధం పేరుతో విప్లవోద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నాయని, ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఈనెల 18 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా నిరసన వారాన్ని పాటించాలని, 24న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది.

ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మీడియాకు పంపిన ప్రకటనలో ఈ వివరాలు వెల్ల డించారు. కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఝా ర్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కగార్ యుద్ధం పేరుతో పార్టీ నేతలపై, కార్యకర్తలపై ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్ , దాడులు చేస్తున్నాయన్నారు. ఇవి వాస్తవానికి హత్యలే. విప్లవ నాయ కులను పట్టుకొని, నిరాయుధంగా ఉన్నప్పటికీ కోర్టుకు హాజరుపర్చకుండా చంపేస్తున్నారని ఆయన ఆరోపించారు.    

 వికసిత్ భారత్’ దుష్ట పథకం

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ’వికసిత్ భారత్’ పేరుతో దేశాన్ని 2047 నాటికి ’కార్పొరేట్ హిందూ దేశం గా’ మార్చాలని చూస్తోందని అభయ్ ఆరోపించారు. ఈ దుష్టపథకానికి మావోయిస్టు ఉద్యమ మే ప్రధాన అడ్డంకి కాబట్టి, తమ పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వికసిత్ భార త్’ పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చే కుట్ర సాగుతోంది అని అన్నారు. ప్రభు త్వం ఇప్పుడు సాయుధ నక్సలైట్ల తర్వాత పట్టణ ప్రాంతాల మేధావులపై దాడి చేసే ప్రయత్నంలో ఉంది. ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో ప్రజాపక్ష శక్తులను, రచయితలను, సామాజిక కార్యకర్తలను టార్గెట్ చేస్తోంది అని అన్నారు.    రాజ్యాంగాన్ని మార్చి ఆధునిక మనుస్మృతిని దేశ చట్టంగా మా ర్చే ప్రయత్నం జరుగుతోంది అని పేర్కొన్నారు.

దళితులు, ఆదివాసీలపై కూడా..

ఇటీవల హర్యాణా రాష్ట్రంలో అదనపు డీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య, ఖజురాహో విష్ణు విగ్రహంపై హిందుత్వ న్యాయవాది బూటు విసిరిన ఘటనలు రాబోయే రోజుల్లో హిందుత్వ శక్తులు దళితులు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాలపై మరింత దాడులు చేస్తారన్న సంకేతాలు అని చెప్పారు.