calender_icon.png 5 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక పౌర్ణమి.. ఆపరేషన్ సిందూర్ దీపాలంకరణ

05-11-2025 07:03:09 PM

అచ్చంపేట: శైవ క్షేత్రాలకు నిలయమైన నల్లమల్లలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలోని శైవ క్షేత్రాలు భక్తుల రద్దీతో జనసంద్రంగా మారాయి. అందులో భాగంగా అచ్చంపేటలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం ఆపరేషన్ సిందూర్ ఆకృతిలో కార్తిక దీపాలు వెలిగించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు దాసపత్రి శకుంతల ఆలయ అధ్యక్షులు వనం పర్వతాలు పద్మశాలి సంఘం అధ్యక్షులు కోటకిశోర్, వనం గీత, గుర్రం హైమావతి, కర్నాటి రాములు, చిలువేరు ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.