05-11-2025 07:05:35 PM
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్..
తుంగతుర్తి (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మద్దతుగా బోరబండ డివిజన్ లోని క్లస్టర్-1 రాజ్ నగర్, క్లస్టర్-2 సైట్-1 పోలింగ్ బూత్ ఇంచార్జులైనా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, సునీత గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కంకణ బద్ధులై పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.