30-07-2025 04:49:50 PM
బైంసా (విజయక్రాంతి): కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో నూతన శివాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Pawar Rama Rao Patel) పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆలయం లోపల అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రజలు మహాదేవుని ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.