calender_icon.png 10 November, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోట: కేసీఆర్

10-11-2025 08:58:06 AM

అందెశ్రీ మృతి పట్ల కేసీఆర్ సంతాపం. 

అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్.

హైదరాబాద్: ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ(Telangana Poet Ande Sri Passes Away) మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

ప్రఖ్యాత కవి, రచయిత అందె శ్రీ(Ande Sri ) 64 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ పాఠశాల విద్య లేనప్పటికీ ప్రముఖ కవిగా ఎదిగారు. ఆయన పాట "మాయమైపోతున్నడమ్మ" పాటు విస్తృత ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఆయన స్వరకల్పన "జయ జయహే తెలంగాణ"ను రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించిన విషయం తెలిసిందే.