calender_icon.png 10 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైటిల్ లాంచ్ కన్నా ముందే ప్రియాంక చోప్రా లుక్

10-11-2025 01:26:43 AM

మహేశ్ బాబు-ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం ’ఎస్‌ఎస్‌ఎంబీ 29’. అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఆఫ్రికన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించారు.

యన్ను ’కుంభ’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు జక్కన్న టీమ్ రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ను ఈ నెల 15న ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఏమై ఉంటుంది.. మహేశ్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది.. ఇంతకీ హీరో పాత్ర పేరేంటి..? అంటూ బాగా చర్చించుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం టైటిల్ లాంచ్ ఈవెంట్లో టైటిల్తోపాటే మహేశ్ బాబు పోస్టర్ కూడా బయటకు రాబోతుందట.

అయితే, ఈ రెండింటి కంటే ముందే టీమ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. తాజా కథనాల ప్రకారం నవంబర్ 11న ప్రియాంకా చోప్రా పోస్టర్, పాత్ర పేరు లాంచ్ చేయబోతుందట జక్కన్న టీం. ఈ క్రేజీ వార్తపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా రాజమౌళి సరికొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడా..? అంటూ చర్చ నడుస్తోంది. ఈ మూవీని దుర్గా ఆరట్స్ బ్యాన్ప కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.