calender_icon.png 10 November, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత

10-11-2025 08:41:28 AM

హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(Ande Sri Passes Away) (64) కన్నుమూశారు.  అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అందెశ్రీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ(Ande Sri) జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం.. గీతం రచించారు. 'జయజయహే తెలంగాణ'(Jaya Jaya He Telangana గీతాన్ని ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. మాయమైపోతున్నడమ్మా(Mayamai pothunnadamma).. పాటతో అందెశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. పాఠశాల చదువు లేకుండానే ఆయన కవిగా రాణించారు. 2006లో గంగ సినిమాకు అందెశ్రీ నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2015లో దాశరథి సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఆర్. నారాయణమూర్తి సినిమాలకు అందెశ్రీ పలు పాటలు రాశారు. లోక్ నాయక్ పురస్కారం కూడా ఆయన అందుకున్నారు.

అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో(Telangana Movement) కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana State Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం 1961 జూలై 18న జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.