10 July, 2026 | 2:23 AM

ఎంపీ వద్దిరాజు రవిచంద్రను అభినందించిన కేసీఆర్

10-07-2026 01:21 AM

ఖమ్మం, జులై 9 (విజయక్రాంతి): రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా వద్దిరాజు రవిచంద్ర నియమితులైన సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు రాసిన లేఖను కేసీఆర్ ఎంపీ వద్దిరాజుకు అందజేశారు. తనను రాజ్యసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్గా నియమించినందుకు పార్టీ అధినేత కేసీఆర్ కి వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.