13 April, 2026 | 5:18 AM

దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది కేసీఆరే

08-12-2024 02:33 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి):  దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని.. రూ.500 పెన్షన్‌ను రూ.4 వేలు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.6వేలకు పెంచుతామని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. దివ్యాంగ ప్రతినిధులు ఆయన నివాసంలో హరీశ్‌రావును శనివారం కలిసి ఈనెల 26న నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి రావాలని కోరారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాలను మోసం చేసినట్టే దివ్యాంగులను కూడా ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు దివ్యాంగుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. చేయూత పెన్షన్ దారుల మహాధర్నా కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.