calender_icon.png 23 August, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్‌బ్యాక్ కోసం కీర్తి ఎదురుచూపు

23-08-2025 12:28:22 AM

తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేశ్.. సినిమాల విషయంలో పెళ్లి తర్వాత కొంచెం జోరు తగ్గిందనే చెప్పాలి. అటు బాలీవుడ్‌లో తొలిసారి నటించిన ‘బేబీ జాన్’ సినిమా ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదు.  దక్షిణాదిన మాత్రం ఈ అమ్మడికి ఆఫర్స్‌కు కొదువ లేదు. కీర్తి సురేశ్ కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్‌తో ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. మిస్కిన్ ఇప్పటికే కీర్తిని కలిసి కథ చెప్పడం..

ఆమె ఆసక్తి చూపించడం జరిగిందని టాక్. త్వరలో ఈ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఉంటుందని అంటున్నారు. తెలుగులో నానితో ‘దసరా’లో జత కట్టి హిట్ అందుకుంది. ‘భోళా శంకర్’లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్‌లో మెరిసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో సినిమాలే లేవు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో రూపొందనున్న రెండు సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలకు సైన్ చేసింది.

ఈ రెండు చిత్రాలూ ఒకేసారి పట్టాలెక్కనున్నాయి. కీర్తి సురేశ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు అభిమానులకు దిల్ రాజు బ్యానర్ తీపి కబురు తెలిపింది. తమిళ్‌లో కొత్త హీరోయిన్ల రాకతో కీర్తి సురేశ్ డిమాండ్ తగ్గినట్టు తెలుస్తోంది.

అందుకే ‘ఎల్లమ్మ’, ‘రౌడీ జనార్ధన’తో తెలుగులో మళ్లీ సత్తా చాటాలని చూస్తోందీ ముద్దుగుమ్మ. ఇదిలావుండగా కీర్తి సురేశ్ నటించిన ‘రివాల్వర్ రీటా’ ఆగస్టు 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో ‘రివాల్వర్ రాణి’ పేరుతో తీసుకొస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్.. ఈ వెర్షన్ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.