calender_icon.png 23 August, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు

23-08-2025 04:18:31 PM

బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాలి, సేవ చేయాలి..

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల లబ్ధిదారుల గుర్తింపు శిబిరంలో సూచించిన జిల్లా విద్యాధికారి పార్శి అశోక్

ఆర్మూర్: దివ్యాంగ విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉంటాయని జిల్లా విద్యాధికారి పార్శి అశోక్(District Education Officer Parsi Ashok) పేర్కొన్నారు. దివ్యాంగుల సేవను తల్లిదండ్రులు, సహిత విద్యా విభాగం ఉద్యోగులు బరువుగా భావించకుండా బాధ్యతగా భావించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని సీఎస్ఐ కాంపౌండ్ లో గల హెచ్ పీడీ బదిరుల ఆశ్రమ పాఠశాలలో జిల్లా విద్యా శాఖ, సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలింకో) సంయుక్తంగా దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని శనివారం నిర్వహించారు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోర్డినేటర్ పడకంటి శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో జిల్లా విద్యాధికారి పార్శి అశోక్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందజేస్తున్న ఆలింకో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. దివ్యాంగులను వారి తల్లిదండ్రులను శిబిరానికి రప్పించడంలో కృషి చేసిన ఐఈఆర్పీ లకు అభినందలు తెలియజేశారు.

అంతకు ముందు కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 294 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ సహాయ ఉపకరణాలు పంపిణీ చేశామన్నారు. ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫిర్దౌస్ ఫాతిమాతో పాటు ఆలింకో నిపుణులు రుక్మిణి, ఓం ద్వివేది, బదిరుల పాఠశాల మేనేజర్ సువర్ణ కిరీటి, ప్రిన్సిపాల్ శాంత మూర్తి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని నింపుతూ అవగాహన కల్పించారు. డీఏం అండ్ హెచ్ వో ఆధ్వర్యంలో నర్సింగ్ ఆఫీసర్ రజిత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ సేవలను అందించారు. అనంతరం దివ్యాంగులతో పాటు వారి తల్లిదండ్రులకు ట్రావెలింగ్ అల్లవెన్స్ ఇస్తూ భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ శిబిరంలో ఐఈఆర్పీ లు దమ్మీ రాజన్న, లింబాద్రి స్వామి, శేఖర్, జలంధర్, కిషన్, ఆనంద్, రామంచ కిషన్, రాజ నర్సయ్య , ప్రేమ స్వరూప, శైలజ, మౌలిక, రమాదేవి, స్పెషల్ టీచర్లు శ్రీనివాస్ రెడ్డి, గాంగమణి, గౌతమి, సురేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.