08-09-2025 12:00:00 AM
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం
కీసర, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) ః సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణం కారణంగా, ఆలయ శుద్ధి , సంప్రోక్షణ కార్యక్రమాల నిమిత్తం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలలోపు స్వామివారికి నిత్య కైంకర్యాలు, నివేదన కార్యక్రమాలను పూర్తి చేసి, అనంతరం ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేసి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.
చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత, ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. తిరిగి అన్ని పూజా కార్యక్రమాలు యధావిదిగా ప్రారంభమ వుతాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.