calender_icon.png 9 September, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత

09-09-2025 02:27:08 PM

హైదరాబాద్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) కార్యాలయంలో కాళోజీ జయంతి(kaloji jayanthi) కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కల్వకుంట్ల కవిత(kalvakuntla kavitha ) నివాళులర్పించారు. రేపు చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె నివాళర్పించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ... ఉన్నతమైన ఆశయాలతో అడుగువేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ(Social Telangana) సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకుని పోతామని తెలిపారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అజెండాను జాగృతి తరుఫున ముందుకు తీసుకెళ్తామన్నారు. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పనిచేశాం, పనిచేస్తామని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కవిత సూచించారు.

కాళేశ్వరం కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ జలాలతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే పదవికి వన్నె తెస్తారని ఆమె వెల్లడించారు. హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని కవిత ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అంచనా వ్యయం అమాంతం పెంచి కాంట్రాక్టును రేవంత్ రెడ్డి కట్టబెట్టారని విమర్శించారు. 1500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టును 7360 కోట్లకు పెంచిన రేవంత్ రెడ్డి మేఘా కంపెనీకి ధారాదత్తం చేశారని ద్వజమెత్తారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నా మల్లన్న సాగర్ కు ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చింది ? అని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించింది.