calender_icon.png 9 September, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ నారాయణ ఆశయాలను కొనసాగించాలి

09-09-2025 02:46:50 PM

ములుగు,(విజయక్రాంతి): కాళోజి నారాయణ జయంతి(Kaloji Narayana Jayanti) సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు కాళోజి నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి నారాయణ తెలుగు సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో చేసిన కృషి విశేషమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మహేష్ బాబు,ఇతర సిబ్బంది పాల్గొని కాళోజి నారాయణకి నివాళులు అర్పించారు.