calender_icon.png 9 September, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

09-09-2025 02:44:38 PM

ఖానాపూర్ స్పెషల్ ఆఫీసర్ జీవరత్నం, ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు.

 ఖానాపూర్ (విజయక్రాంతి): మండలంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా పాటించి, పోషకాహారం అందించాలని మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు అన్నారు. మంగళవారం వారు మండలంలోని సత్తెనపల్లి జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించారు. ఈ క్రమంలో అక్రమాలకు పాటుపడితే కఠిన చర్యలు ఉంటాయని వారు అన్నారు. దాంతో పాటు ఆ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి పనులు వేగవంతంగా చేయాలని మేస్త్రీలకు, కమిటీ సభ్యులకు సూచించారు.