calender_icon.png 16 July, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామంచలో ఘనంగా గోరింటాకు సంబరాలు

15-07-2025 07:10:23 PM

సిద్దిపేట: చిన్నకోడూరు మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం గోరింటాకు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా  గోరింటాకును ఒకరికొకరు పెట్టుకొని సంబరాలు చేసుకున్నారు. మేడంలు ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు గోరింటాకును పెట్టి అందరి చేతులను ఎరుపు రంగులోకి మార్చారు.

మైదాకు శరీరాన్ని తెల్ల బరచడమే కాకుండా, ఇన్ఫెక్షన్స్ సోకకుండా చూస్తుందని అందుకోసం ఆషాడ మాసంలో అందరూ మైదాకును పెట్టుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు.  విద్యార్థుల ఆటా పాటలు, నృత్యాలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చదువుతోపాటు వివిధ సంబరాలు, సాంస్కృతి కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఆనందంగా  పాల్గొన్నారు.