calender_icon.png 16 July, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలు తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

15-07-2025 06:52:37 PM

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని పెరుకబండ,  గుండారం, పోతారం, ప్రాథమిక పాఠశాలలను గుండారం ఉన్నత పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం, హాజరు పట్టిక, విద్యార్థులు సాధిస్తున్న అభ్యసన సామర్ధ్యాలను వారు  పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి తగు సూచనలు సూచించారు. ప్రతిరోజు విద్యార్థుల ఎఫ్ ఆర్ ఎస్ నమోదు చేయాలని, విద్యార్థులకు ఇస్తున్న పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ దుస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు.