15-07-2025 07:05:27 PM
చివ్వేంల,(విజయక్రాంతి): మండలంలోని మున్యానాయక్ తండ గ్రామంలో హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ బారిన పడకుండా, అడ్వకేసి సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కల్పించారు. అనంతరం సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ హెచ్చి నరేష్ మాట్లాడుతూ.. హెచ్ఐవి ఎయిడ్స్ అండ్ హెపటైటిస్, బిహెపటైటిస్ సిసిపిలిస్ టీవీ గురించి అవగహన కల్పించారు. అనంతరం పిహెచ్ వైద్యాధికారిని భవాని మాట్లాడుతూ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో హెచ్ఐవి గుర్తించి వెంటనే వారిని సంపూర్ణ సురక్ష కేంద్రంలో నమోదు చేయించాలన్నారు. ఎస్ఎస్టీఐ ఎస్టీడీ, సిఫిలిస్, సుఖ వ్యాధులు గురించి వివరించడం జరిగింది. గ్రామంలోని యూత్, గ్రామ ప్రజలను అవగాహన కల్పించాలన్నారు.