15-07-2025 06:57:03 PM
మునగాల: మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ఆధ్వర్యంలో కలకోవ గ్రామం నందు నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు టీబి నోడల్ పర్సన్ రామకృష్ణ మాట్లాడుతూ వారానికి మించి దగ్గు, దగ్గినప్పుడు కళ్ళేలో రక్తపు చారలు పడటం, చాతిలో నొప్పి, బరువు తగ్గడం రాత్రిపూట జ్వరంతో పాటు చమటలు రావడం, ఆకలి ముందగించడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేసి, స్థానిక ఆరోగ్య కేంద్రంలో క్షయ నిర్ధారణ పరీక్షలు చేపించుకోవాలనీ తెలియజేశారు.
క్షయ వ్యాధి సోకిన వారు 6నెలల మందులు వాడటo ద్వారా పూర్తిగా నయమవుతుంది దీనినీ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మరణించవచ్చు. ముందు జాగ్రత్తగా ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ వ్యాధి శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది..ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, బిపి షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ,వృద్ధుల కు
ఈ వ్యాధి త్వరగా సోకుతుంది
కాబట్టి పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలి.ప్రస్తుతం 14 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాము. ఈరోజు వైద్య శిబిరానికి మొత్తం 125మంది హాజరయ్యారు జిల్లా కేంద్రం నుండి తీసుకొని వచ్చిన డిజిటల్ ఎక్స్ రే ద్వారా 80 మందికి పరీక్షలు చేశాము.25మంది నుండి కళ్ళే సేకరించి పరీక్షల కోసం జిల్లా కేంద్రం లాబరేటరికి పంపించాము..20 మందికి చిరు వ్యాధులకు మాత్రలు పంపిణీ చేశాము..క్షయ వ్యాధి సోకిన వారికి . వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం నుండి ఉచితంగా 6 నెలలు న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నాము.
ప్రజలు ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.దోమల నివారణకు పరిసరా లను శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి రెండుసార్లు డ్రైడే పాటించి నీటి నిలువలు లేకుండా చూసుకోవాలి, దోమ తెరలను వాడాలి, డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు వ్యాధుల బారిన పడకుండా దోమలను నివారించాలి. ప్రజల భాగస్వామ్యంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలనీ అవగాహన కల్పించారు.