15-07-2025 07:16:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించారు. ప్రతిరోజు పాఠశాలకు రావాలని కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.