calender_icon.png 16 July, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయి బ్రాహ్మణ సేవా సంఘము నూతన కమిటీ ఎన్నిక

15-07-2025 07:13:45 PM

నూతన అధ్యక్షుడు గా సింగిరాల శ్రీనివాస్

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘము నూతన జిల్లా అధ్యక్షులుగా సింగిరాల శ్రీనివాస్ ను ఎన్నుకోవడం జరిగిందని నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు తెలిపారు.  సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 నెలలుగా అధ్యక్షుడు గా కొనసాగిన కొత్వాల్ నరేందర్ ని తొలగిస్తున్నామని తెలిపారు. 13 గడుస్తున్నా ఇప్పటి వరకు సంఘంలో ఎలాంటి కార్యక్రమలు చేయకపోగా, ఇంత వరకు సంఘం బాడీని నియమిచలేదని తెలిపారు. మాకు పని చేసే వ్యక్తి కావాలనీ,  అందుకే నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అల్పుల స్వామినిని  ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.