15-07-2025 07:00:39 PM
ఏరియా జిఎం జి దేవేందర్
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి భూగర్భ గనులలో విధులు నిర్వహించే కార్మికులు హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఏరియా జిఎం జి.దేవేందర్ కోరారు. ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో మంగళవారం కాసిపేట 1, కాసిపేట 2 గనిలో విధులు నిర్వహిస్తూ 100 హాజర్లు పూర్తి చేయని కార్మికులకు నిర్వహించిన కుటుంబ సభ్యుల కౌన్సిలింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అందరి అదృష్టమని, యువ కార్మికుల తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని, ప్రతి ఒక్క ఉద్యోగి తమ యొక్క హాజరు శాతాన్ని పెంచుకొని సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేవని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగులు ప్రతినెల 20 హాజర్లు పూర్తి చేయాల న్నారు.