15-07-2025 07:24:02 PM
నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన ఆయన హాజరు పట్టికను పరిశీలించి విద్యా బోధన మధ్యాహ్న భోజన పథకం ఉచిత పాఠ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై వివరాలను అడిగారు.