18 April, 2026 | 2:25 PM

తెలుగులో కేసరి ఛాప్టర్2

15-05-2025 12:11 AM

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలాబాగ్’. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. అక్షయ్‌కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన ప్రధాన పాత్రలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు విమర్శకుల ప్రశంసలతోపాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.

అందుకే సినిమాను తెలుగులోకి అనువదించి, మే 23న విడుదల చేయనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ దీన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ తర్వాత బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది సీ శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.