17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మార్గన్ వచ్చేది అప్పుడే

15-05-2025 12:13 AM

విజయ్ ఆంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ -క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం అవుతున్నాడు.

ఇందులో ఇంకా సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయబోతు న్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి యువ ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, రాజా ఏ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతుండటం విశేషం.