calender_icon.png 20 May, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా ప్రతి సినిమాకూ ప్రేక్షకులు పెరగాలనే అలా చేస్తున్నా

15-05-2025 12:10:27 AM

నవీన్‌చంద్ర హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన ఎన్ సుధాకర్‌రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మే 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

“లెవన్’ టైటిల్ కథ నుంచి వచ్చిందే. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నా. ఇందులో ట్విస్టులను ముందుగా డీకోడ్ చేయడం కష్టం. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు ప్రీప్రొడక్షన్ చేశాం. బైలింగ్వల్ చేయడం ఇప్పుడు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నా. ఈ సినిమాకు తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పా. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకూ ప్రతి భాషలో డబ్బింగ్ నేనే చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తుంటా. 

కెరీర్ ప్రారంభంలో ఒక క్యారెక్టర్ నుంచి బయటపడటం కొంచెం సమస్యగానే ఉండేది. షూటింగ్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్‌ను ఇంటి వరకూ తీసుకెళ్లేవాడిని. పెళ్లి తర్వాత దాన్ని మెల్లమెల్లగా మానుకున్నా. ‘మాస్ జాతర’లో -రవితేజకు విలన్‌గా చేయాలని సితార నుంచి కాల్ వచ్చింది. ‘అరవింద్ సమేత’లో నా క్యారెక్టర్‌ను యూనిక్‌గా ఫీల్ అయినట్టే.. ఇందులోనూ ఉంటుంది. నా లుక్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది.

-నా ప్రతి సినిమాకూ కనీసం 10 మంది ప్రేక్షకులైనా పెరగాలనే ఉద్దేశంతోనే అన్ని రకాల పాత్రలు చేస్తున్నా. ఇప్పుడు కరుణకుమార్‌తో ‘హనీ’ అనే సినిమా చేస్తున్నా. చాలా డార్క్ సినిమా అది. -అలాగే ‘కాళీ’ అనే యాక్షన్ సినిమా ఒకటి, తమిళ్‌లో మరో సినిమా జరుగుతోంది. ఇవే కాకుండా హరి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. అది కామెడీ ఫిలిం. ఫస్ట్ టైం కామెడీ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌” అని చెప్పారు.