28-07-2025 03:36:20 PM
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో(Winter Session Of Parliament) భాగంగా లోక్ సభ(Lok Sabha)లో సోమవారం ఆపరేషన్ సిందూర్ పై చర్చ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మూడు సార్లు వాయిదా పడిన లోక్ సభ మధ్యాహ్నాం 2 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Union Defense Minister Rajnath Singh) ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టిన సైన్యానికి అభినందనలు తెలియజేశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని, మతం పేరు అడిగి మరీ పర్యాటకులను కాల్చి చంపారని, అందుకే దేశ ప్రజలను రక్షించండం మా ప్రభుత్వం బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనికి ఆపరేషన్ చేపట్టామన్నారు.
ఆపరేషన్ సిందూర్ కు ముందు సైనికులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్థాన్ లోని సామన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడుల జరిపారని రాజ్ నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ లో వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని, మే 7 రాత్రి భారత బలగాలు తమ శక్తి, సామర్థ్యాలు చాటిచెప్పామని ఆయన అభిప్రాయపడ్డారు. పీవోకే, పాక్ లోని ఏడు ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం 22 నివిషాల్లో పూర్తి చేశారని రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. సింధూర్ అనేది వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగిందని ఆయన తెలిపారు. పాక్ దాడులను మన సైనికులు సమర్థంగా మిసైల్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పాకిస్థాన్ లోని మిసైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.