28-07-2025 04:53:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి(AISF State President Kasireddy Manikanta Reddy) అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సంఘం నాల్గవ మహాసభలను ప్రారంభించారు. మొదట జెండాను ఆవిష్కరించి ఏఐఎస్ఎఫ్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. ఫీజు రియంబర్మెంటును వెంటనే విడుదల చేయాలని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విలాస్ సంఘం నాయకులు రవిగా రవీందర్ శ్రీకాంత్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.