28-07-2025 04:58:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి పోటీ పడాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని కస్బ జుమ్మా రాజ్ పేట్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజనం, విద్యా ప్రణాళిక అంశాలపై ఉపాధ్యాయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయి బాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.