28-07-2025 04:50:03 PM
గుంతలమయమైన రోడ్డు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
సిపిఎం నాయకుల డిమాండ్..
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ దారపాడు కాలనీ నుంచి కిష్టారం రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్(CPM District Secretary Group Member Repakula Srinivas) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదివాసీ గ్రామాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఏళ్ళ తరబడి రోడ్డు లేక కొత్తూరు, దారపాడు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు.
గిరిజన ప్రజలకు రోడ్డు నిర్మాణం అవుతుందన్న ఆశలు అడియాశలు చేశారని ఆయన విమర్శించారు. కోయగూడెం ఓసి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ ద్వారా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, గ్రామాల్లో వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డెంగీ దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఈసం నర్సింహారావు, మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న, కొత్తూరు గ్రామస్తులు జార ముత్తయ్య, జార సమ్మయ్య, ఇరప బుచ్చయ్య, ఇరప స్వామి, ఇరప నర్సయ్య, పాయం మల్లేష్, నాలి శేఖర్, ఎల్లబోయిన రాంబాబు, ఇరప దేవరాజ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.