28-07-2025 04:47:06 PM
మహబూబాబాద్/జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వెల్లువలా వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో(Additional Collector Lenin Vatsal Toppo), అనిల్ కుమార్(Additional Collector Anil Kumar)తో పాటు జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఇందులో అధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మంజూరు, ఇంటి స్థలాలు, భూభారతి అంశాలపై ప్రజలు అధికారులకు 169 విజ్ఞప్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పురుషోత్తం, మధుసూదన రాజు, శ్రీమన్నారాయణ, శ్రీనివాసరావు, శ్రీనివాస్, దేశి రామ్, కృష్ణవేణి, శిరీష, వెంకటేశ్వర్లు, వీరన్న, యాదగిరి, మదన్మోహన్, సురేష్ పాల్గొన్నారు.
భూపాలపల్లిలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ప్రజల నుండి విజ్ఞప్తుల స్వీకరించారు. వివిధ అంశాలకు సంబంధించిన 59 దరఖాస్తులను ప్రజలు అదనపు కలెక్టర్ కు అందజేశారు. ఆయా అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులకు ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను అదనపు కలెక్టర్ పరిష్కారం కోసం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.