calender_icon.png 28 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

28-07-2025 04:37:00 PM

అనంత లోకాలకు..

బావిలో పడ్డ ఆటో.. తండ్రి మృతి

తల్లికి తీవ్ర గాయాలు.. కొడుక్కి స్వల్ప గాయాలు 

మహబూబాబాద్ (విజయక్రాంతి): సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న క్రమంలో అదుపుతప్పి ఆటో బావిలో పడ్డ ఘటనలో తండ్రి మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడగా, కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండలం మునిగల వీడు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లికుదురు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు(SI Chirra Ramesh Babu) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపురం గ్రామంలో తమ సమీప బంధువు ఒకరు చనిపోగా అంత్యక్రియలకు మునిగల వీడుకు చెందిన శ్రీరామ్ మార్కండేయ ఆటో డ్రైవర్ తన తండ్రి నరసయ్య, తల్లి భారతమ్మతో కలిసి సొంత ఆటోలో బయలుదేరి వెళ్లారు. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత రాత్రి వెంకటాపురం నుండి ఆటోలో ఇంటికి బయలుదేరారు.

మార్గమధ్యలో మార్కండేయ ఆటోను వేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో శ్రీరాం నరసయ్య (70) ఘటనస్థలిలోనే మరణించగా, భారతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మార్కండేయకు స్వల్ప గాయాలు కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, బంధువులు ఘటనస్థలికి చేరుకొని బావిలో నుండి క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. భారతమ్మ పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. మరణించిన నరసయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.