calender_icon.png 28 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ధర్నా

28-07-2025 04:56:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం సిఐటియు(CITU) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంతకుముందు మధ్యాహ్న భోజన కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐదు నెలల పెండింగ్ విత్తనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ లక్ష్మీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.