28-07-2025 04:40:13 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ టి మండలంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) సోమవారం ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి రోగులను పరామర్శించారు వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మొయినోద్దీన్, ఏడిఏ మనోహర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.