calender_icon.png 28 July, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే లక్ష్యం

28-07-2025 04:00:18 PM

న్యూఢిల్లీ: పాక్ నుంచి వచ్చిన అన్ని రకాల దాడులను మన రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని, మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. మన త్రివిధ దళాలు కలిసి పాక్ దాడులను తిప్పికొట్టాయని, ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత సైనికులు వారి శిబిరాల్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతమార్చారని రాజ్ నాథ్ సింగ్ గౌర్వంగా చెప్పారు. ఉగ్రవాదులపై మనం చేసిన దాడులను అనే దేశాలు సమర్థించాయని, సరిహద్దులు దాటి వెళ్లడం ఆపరేషణ్ సిందూర్ లక్ష్యం కాదని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే సంస్థల ధ్వంసమే మా లక్ష్యమన్నారు. యుద్ధం మా లక్ష్యం కాదు.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడమే లక్ష్యమని, భారత్ సైనికులు చేసిన దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చి తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ అధికారులు విజ్ఞాప్తి చేశారని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. 

మాతృభూమి రక్షణలో మన సైనికుల వీరత్వం కనిపిస్తోందని, భుజ్, ఉదంపూర్ స్థావరాలకు వెళ్లి సత్తా ప్రత్యక్షంగా చూశా అని కొనియాడారు. మన సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్ష నేతలకు సరికాదని, ఈ సందర్భం ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని గట్టిగా చెబుతుతన్నామని రాజ్ నాథ్ తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వినలేదని ఆయన వాపోయ్యారు. ఇలాంటి విషయాల్లో ఆచితూచి, ఆలోచించి ప్రశ్నలు అడగాలని మంత్రి హితవు పలికారు. 1962లో చైనాతో యుద్దం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలన్నారు.

ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించారని, భారత్ సైనికుల చర్యను అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రశంసించారని రాజ్ నాథ్ గుర్తి చేశారు. 1999లో శాంతియుత పరిస్థితి, పాకిస్థాన్ తో స్నేహం కోరుకుంటుందని కోరుతూ వాజ్‌పేయి లాహోర్ యాత్ర చేపట్టారన్నారు. స్నేహ హస్తం చాచడం మన దేశం గొప్పతనం అని వివరించారు. ఆనాడు వాజ్‌పేయి తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మర్నాడు సూర్యోదయం చూసేది కాదని రాజ్ నాథ్ చెప్పారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే ఉంది కానీ, యుద్ధాలు కోరుకోమని, ప్రతి విషయాన్ని మానవత్వ కోణంలో ఆలోచిస్తాం... తొపాకులు పేలితే ఎవరూ మిగులరు అని కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదుల అంతిమ క్రియల్లో పాకిస్థాన్ అధికారులు పాల్గొన్నారని, దీంతో ఉగ్రవాదులను ఆ దేశం ఎలా పెంచిపోషిస్తోందో స్పష్టంగా తెలుస్తోందని రాజ్ నాథ్ మండిపడ్డారు.