28-07-2025 04:26:34 PM
కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్(Commissioner Dr. Ajay Kumar) వైద్యులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కొరతను జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని అతి త్వరలో భర్తీ చేస్తామన్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వాటిపై నిర్లక్ష్యంగా ఉండకూడదని సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ కు సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గైనకాలజిస్ట్, స్కానింగ్, ఇతర టెస్ట్ లు అన్ని అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం పలు వార్డ్స్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్స్ సురేష్, వైద్య సిబ్బంది ఉన్నారు.