26 April, 2026 | 11:58 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం

28-04-2024 01:31 AM

ఖమ్మం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి):  కమ్యూనిస్టులు బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న టీస్టాల్‌కి వెళ్లి టీ మరిగించి తన వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందించారు. అక్కడే కార్యకర్తలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసి ప్రచారాన్ని కొనసాగించారు. అలాగే ఉదయం సర్దార్ పటేల్ స్టేడియంలో  క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్, షటిల్ ఆడారు. వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవ కోసమే పోటీచేస్తున్నానని, మద్దతిచ్చి గెలిపిస్తే అందరికీ అండగా నిలుస్తానని అభయమిచ్చారు.