calender_icon.png 27 July, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్

27-07-2025 01:12:10 PM

కేంద్ర హోంశాఖ సహయమంత్రి బండి సంజయ్

కరీంనగర్,(విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్ కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ అని కేంద్ర హోంశాఖ సహయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో మిడియాతో మాట్లాడుతూ బీసీ ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర అన్నారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందని, ఆ విష వ్రుక్షాన్ని అడ్డుకోకుంటే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని లేకుంటే ముస్లిం రిజర్వేషన్లను బీసీ జాబితానుండి తొలగించేదాకా ఉద్యమిస్తామన్నారు.

మోదీ కన్వర్టెడ్ బీసీ అయితే... రాహుల్ గాంధీది ఏ కులం? ఏ మతం?చెప్పాలన్నారు. రాహుల్ తల్లి క్రిస్టియన్, తాత ముస్లిం నుండి వేరుపడ్డ పార్శీ మతస్తుడని, అందుకే హిందుత్వముని ధ్వంసం చేస్తామని విషం కక్కుతున్నాడన్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేత దుర్మార్గమని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కోసమే పెద్దమ్మ గుడి కూల్చివేశారని, 30 శాతం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తామన్నారు.