calender_icon.png 27 July, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు.. డా.నమ్రతా అరెస్ట్

27-07-2025 02:19:14 PM

హైదరాబాద్: నగరంలో తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్టె ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకోని, వైద్య పరీక్షల నిమిత్తం ముగ్గరినీ గాంధీ అసుపత్రికి తరలించారు. నిన్నరాత్రి 2 గంటల వరకు ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు పలు కీలక పత్రాలతోపాటు వీర్యకణాల శాంపిల్స్ ను తీసుకెళ్లారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ కు చెందిన దంపతులు డాక్టర్ నమ్రతను సంప్రదించారు.

టెస్టుల కోసం రూ.66 వేలు తీసుకుని సరోగసీకి వెళ్లమని, దంపతుల స్పెర్మ్, అండం తీసుకొని సరోగసీ చేస్తామని, అందుకు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని డా. నమ్రత చెప్పారు. రూ.15 లక్షలు నగదు, రూ.15 లక్షలు చెక్కు రూపంలో ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో రూ. 5 లక్షలు నమ్రత ఖాతకు బదిలీ చేసిన దంపతులను సెప్టెంబర్ లో విశాఖకు పిలిచి స్పెర్మ్, అండం సేకరించారు. ఈ నేపథ్యంలో విడతల వారిగా నగదును డాక్టర్ నమ్రత ఖాతాలోకి బాధితులు జమ చేశారు. సరోగసీ విజయవంతంగా ప్రారంభించడంతో ఈ ఏడాది మేలో మొత్తం నగదును చెల్లించారు.

దంపతులకు మగబిడ్డ జన్మించిన ఆనందంలోనే బిడ్డ ఆరోగ్యం క్షీణించింది. దీంతో తల్లిదండ్రులు శిశువుకు డిఎన్ఏ టెస్ట్ చేయించాడంతో అసలు విషయం బయటపడింది. శిశువు డీఎన్ఏ, మహిళ భర్త డీఎన్ఏతో వేరుగా ఉండటంతో ఆ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడ వెళ్లి దవాఖాన నిర్వాహకురాలు నమ్రతతో పాటు సెంటర్ లో పని చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసి విచారించగా, బాధితురాలు వేరే వ్యక్తి స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చేలా చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, 2019లో కూడా ఒక కేసులో కూడా  డా.నమ్రత సరోగసి ద్వారా బిడ్డను అందిస్తామని విశాకకు చెందిన దంపతుల నుంచి రూ.12.5 లక్షలు తీసుకొని ముఖం చాటేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ లోని గోపాలపూరం పోలీసులు కేసు నమోదు చేయడంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దవాఖాన లైసెన్స్ ను ఐదేండ్లపాటు రద్దు చేసింది. తర్వాత 2020లో డాక్టర్ కరుణ అనే పేరుతో లైసెన్స్ తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, పోలీసులు, వైద్యశాఖ అధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో తనిఖీ నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 50 మంది స్పెర్మ్ శాంపిల్స్ ను గుర్తించారు. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపి వీర్యం సేకరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది.