calender_icon.png 16 November, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ మెరుపు దాడులు

16-11-2025 12:44:10 AM

రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 23 బృందాలతో ఏసీబీ అధికారుల తనిఖీలు

-రూ. 2.51 లక్షల లెక్కచూపని నగదు స్వాధీనం 

-ఆఫీసుల్లో పనిచేయని సీసీ కెమెరాలు 

- లబ్ధిదారులకు చేరని 289 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు 

-13 మంది సబ్-రిజిస్ట్రార్ల ఇళ్లలోనూ సోదాలు 

- నగదు, బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణలోని ప లు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి, భారీగా అక్రమాలను వెలుగులోకి తె చ్చింది. 23 ఏసీబీ బృందాలు ఏకకాలంలో నిర్వహించిన ఈ మెరుపుదాడు ల్లో లెక్కచూపని నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, వ్యవస్థీకృతంగా జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టాయి.

గాంధీపేట్, శేరి లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌ న్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా ప్రాంతాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ బృందాలు ఏకకా లం లో దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీ ల్లో మొత్తం రూ.2,51,990 లెక్కచూపని నగదును అధికారులు స్వాధీనం చే సుకున్నారు. ఈ దాడుల్లో పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన 289 డాక్యుమెంట్లు లబ్ధిదారులకు అందజేయకుండా కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తిం చారు.

ఎలాంటి అధికారిక అనుమతి లే కుండా 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాల్లో తిరుగుతూ దళారీలుగా వ్యవహరిస్తున్నట్లు కనుగొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా చూడాల్సిన సీసీ కెమెరాలు చాలా కార్యాలయాల్లో పనిచేయకపోవడం గమనార్హం. ఈ అక్రమాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏసీబీ బృందాలు 13 మంది సబ్-రిజిస్ట్రార్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించాయి.

ఈ సోదాల్లో నగ దు, బంగారం, కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న పత్రాలను, ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ట్లు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా టోల్-ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా లేదా ఏసీబీ అధికారిక ఫేస్బుక్, ఎక్స్ ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ భరోసా ఇచ్చింది.