28-07-2025 07:04:41 PM
దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి..
గంభీరావుపేట (విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి(Telangana State Council of Higher Education) ఆధ్వర్యంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం చేపట్టిన దోస్త్ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ చివరి షెడ్యూల్ ప్రకారం జూలై 31 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించినట్టు గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీమతి వి. విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం ఆగస్టు 3న సీట్ల భర్తీ, ఆగస్టు 6వ తారీకు వరకు కళాశాలలో రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు.
విద్యార్థులు దోస్త్ నమోదు సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానమైనది, పదో తరగతి మెమో, ఇంటర్ రెండో సంవత్సరం హాల్ టికెట్ నెంబర్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం 01.04.2025 తర్వాత జారీ అయినది, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావలన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే కళాశాలలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని సంప్రదించవచ్చని, అక్కడ ఉచితంగా దోస్త్ రిజిస్ట్రేషన్ చేయబడుతుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.