calender_icon.png 29 July, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైదంబండలో ప్రధాన రహదారినే కబ్జా చేసిన ఘనుడు

28-07-2025 06:54:17 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలం(Mutharam Mandal)లోని మైదానం బండ గ్రామంలో ఏకంగా ప్రధాన రహదారిని కబ్జా చేశాడు ఓ ఘనుడు. దీంతో ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిని కబ్జా చేశాడని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకుంటలేరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పుట్ట ఎర్ర ఓదెలు తన ఇంటి ముందు ప్రభుత్వం నిర్మించిన సిమెంటు రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మించాడు. దీంతో ఆ దారిపై ఎదురెదురుగా వస్తున్న వాహనాలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. ప్రధాన రహదారిని కబ్జా చేసిన ఓదెలపై కఠిన చర్యలు తీసుకొని ఆ గోడను తీసివేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.